ఐడిఓసి కాంప్లెక్స్‌లో తల్లులు పిల్లలకు పాలిచ్చే క్యాబిన్లు ప్రారంభం
శిశువులకు తల్లిపాలు అందించడం వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు ఎంతో ముఖ్యం

మన ఇందూర్ /నిజామాబాద్ సిటీ:
శిశువులకు తల్లిపాలు అందించడం వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు ఎంతో ముఖ్యమని, తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ, జిల్లా మహిళా సాధికారిక కేంద్రం (DHEW) ఆధ్వర్యంలో, బేటి బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ ఐడిఓసి కాంప్లెక్స్‌లో తల్లులు తమ చిన్నారులకు సౌకర్యవంతంగా, గోప్యతతో పాలిచ్చేందుకు ఏర్పాటు చేసిన బ్రెస్ట్‌ఫీడింగ్ క్యాబిన్లను సోమవారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమాన్ని జిల్లా రెవెన్యూ అధికారి గీత, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి రాజశ్రీ, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కృష్ణవేణి, జిల్లా సంక్షేమ అధికారి సౌందర్య లు ప్రారంభించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఉద్యోగులు, సందర్శకులు మరియు ఐడిఓసి కాంప్లెక్స్‌కు వచ్చే తల్లులు తమ శిశువులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పాలిచ్చేందుకు ఈ క్యాబిన్లు ఉపయోగపడతాయని తెలిపారు. శిశువులకు తల్లిపాలు అందించడం వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు ఎంతో ముఖ్యమని, తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.బేటి బచావో బేటి పడావో కార్యక్రమం ద్వారా బాలికల సంరక్షణ, విద్య, ఆరోగ్యం మరియు మహిళల సాధికారతకు సంబంధించిన పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. తల్లులు మరియు శిశువుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇటువంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఫర్హత్ డిచ్పల్లి సిడిపిఓ, శ్రీనివాస్ సూపరింటెండెంట్, మహిపాల్ సీనియర్ అసిస్టెంట్, ప్రణతి EO, DHEW -DMC స్వప్న, జెండర్ స్పెషలిస్ట్ లు, స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షి లిటరసీ, అకౌంటెంట్ గార్లు మరియు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






