Mana Indur News
స్థానిక వార్తలు

ఏఐటీయూసీ లో చేరిన ఆటో కార్మికులు

ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి. ఆటో కార్మికులకు ఏఐటీయూసీ అండగా ఉంటాం.

MI
By Mana Indur News•September 14, 2026
6
Share
ఏఐటీయూసీ లో చేరిన ఆటో కార్మికులు

మన ఇందూర్ నిజామాబాద్ అర్బన్:

ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై ఓమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పిన్నెల హనుమాన్లు డిమాండ్ చేశారు.ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో ఆల్ స్కూల్ ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు ఏఐటీయూసీలో చేరడం జరిగింది. వీరికి ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై ఓమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పిన్నెల హనుమాన్లు ఏఐటీయూసీ కండువాలు వేసి సాధనంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆటో కార్మికులు స్వయం ఉపాధి కలిగిన కార్మికులని వీరు ప్రభుత్వం పై ఆధారపడకుండా ప్రైవేటు ఫైనాన్స్ దగ్గర బ్యాంకుల్లో లక్షల రూపాయల అప్పులు చేసి ప్రజా రవాణా లో భాగంగా నిరంతరం ప్రజలను పాఠశాలల విద్యార్థులను తమ గమ్యస్థానాలకు చేరుస్తూ సేవ చేస్తున్నారని వీరి పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయన్నారు. 2019 మోటారు వాహనాల చట్టం ఆటో కార్మికులకు మరణ శాసనంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని తీసుకురావడం ద్వారా కార్మికులకు ఉపాధి లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. దానికి తోడు స్కూల్ పిల్లల ఆటోలు నడిపే కార్మికుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తూ ఫోటోలు తీస్తూ విపరీతమైన ఫైన్ చేయడం ద్వారా మరింతగా అప్పుల ఊబిలో కురుకుపోయే పరిస్థితి వస్తుందన్నారు. మానవ దృక్పథంతో ఉండాల్సిన అధికారులు కర్కషంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఆటో కార్మికులకు ఏఐటీయూసీ అండగా ఉంటుందన్నారు. చేరిన వారిలో వివిధ స్కూళ్ల ఆటో యూనియన్ నాయకులు జావిద్ ,నజీర్, మజార్, హైమద్, ఇసాక్, ఖలీమ్ తదితరులు ఉన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5