క్రైస్తవ మైనారిటీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ కార్యక్రమం
18 నుండి 33 సంవత్సరాలు క్రైస్తవ మైనారిటీ వర్గానికి చెందిన నిరుద్యోగ యువతకు ప్రాధాన్యత

మన ఇందూర్ నిజామాబాద్ అర్బన్
తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (TGCMFC) ఆధ్వర్యంలో క్రైస్తవ మైనారిటీ నిరుద్యోగ యువతకు “Generative AI / AI & Machine Learning” అంశాల్లో ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ శిక్షణ ద్వారా యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించి, ఉద్యోగ అవకాశాలకు అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
అర్హతలు:
ఇంటర్మీడియట్ లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు
వయస్సు 18 నుండి 33 సంవత్సరాలు
క్రైస్తవ మైనారిటీ వర్గానికి చెందిన వారు
నిరుద్యోగ యువతకు ప్రాధాన్యత
శిక్షణ వివరాలు:
కోర్సు: Generative AI / AI & Machine Learning
వేదిక: IT Towers, గ్రౌండ్ ఫ్లోర్, నిజామాబాద్
తరగతులు ప్రారంభం: 28 సెప్టెంబర్ 2026
దరఖాస్తు చివరి తేదీ: 24 సెప్టెంబర్ 2026
అవసరమైన పత్రాలు:
SSC, ఇంటర్మీడియట్ & డిగ్రీ మెమోల జిరాక్స్ ప్రతులు
బాప్టిజం సర్టిఫికెట్
ఆధార్ కార్డు
పాస్‌పోర్ట్ సైజు ఫోటో – 1
ఆసక్తి మరియు అర్హత కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
మరిన్ని వివరాల కోసం సంప్రదించండి:
📞 9666072091
📞 7013675052






