బోర్గం (పి) పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్ సెమినార్.
జిల్లా సైన్స్ అధికారి కే గంగా కిషన్

మన ఇందూర్ నిజామాబాద్ రూరల్
నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ
ఆధ్వర్యంలో శుక్రవారం
స్థానిక జెడ్పిహెచ్ఎస్ బోర్గం (పి) పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ నిర్వహించడం జరిగింది. ఈ సైన్స్ సెమినార్ ఈనెల 16న వివిధ మండలాలలో గెలుపొందిన మొదటి బహుమతి పొందిన విద్యార్థులు జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ లో పాల్గొనడం జరిగిందని జిల్లా సైన్స్ అధికారి కే గంగా కిషన్ తెలిపారు.
ప్రతి సంవత్సరం విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ మ్యూజియం బెంగళూరు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నరని, ఈ సంవత్సరం ఇండియన్ ఎనర్జీ బాస్కెట్ - ప్రాస్పెక్ట్స్ అండ్ ఛాలెంజెస్" అను ప్రధాన అంశంలో నిర్వహించడం జరిగింది. నిజామాబాద్ జిల్లా నుంచి ప్రతి సంవత్సరం దక్షిణ భారత స్థాయికి సైన్స్ సెమినార్ సెలెక్ట్ కావడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణయితలు సిహెచ్ ముద్దుకృష్ణ, బి సాయి బాబా, రఘునాథ్ ,గోవర్ధన్, కాంతారావు మరియు వివిధ మండలాల నుంచి వచ్చిన విద్యార్థులు మరియు వారి గైడ్ టీచర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొదటి స్థానంలో నిలిచిన ఐదుగురికి మెమొంటో లు మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్లతో బహుకరించడం జరిగింది. ఈ సందర్భం గా సైన్స్ అధికారి మాట్లాడుతూ పర్యావరణాన్ని సంరక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకొన వలెనని భవిష్యత్ లో 2047 నాటికి క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ ప్రధానాంశాలుగా ముందుకు కదులుతూ నూతన ఆవిష్కరణలు సాధించవలేనని తెలిపినారు . మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థి ఈ నెల 29న ఎస్ సి ఈ ఆర్ టి హైదరాబాద్ లో నిర్వహించే రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్ లో పాల్గొంటారని ,అక్కడ గెలుపొందిన ఒకరు దక్షిణ భారత స్థాయికి ఎంపిక అవుతారని తెలిపినారు.
మొదటి స్థానంలో ఏ అక్షయ కేజీబీవీ సౌత్ నిజామాబాద్, రెండవ స్థానంలో నిస్వా తహసీన్ హై స్కూల్, మూడవ స్థానంలో జి కీర్తన టి జి ఎం ఎస్ ఆర్మూర్, నాలుగవ స్థానంలో పి అక్షర విజ్ఞాన్ హై స్కూల్ ముప్కాల్, ఫిర్దౌస్ మల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ వర్ని, జి అక్షర జెడ్పిహెచ్ఎస్ చల్లగర్గ






