గణేష్ నిమజ్జనాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్
నిమజ్జన ఘాట్ వద్ద ఖైరతాబాద్ మహాగణపతికి ప్రత్యేక పూజలు చేసిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.
MI
By Mana Indur News•September 25, 2026
0

మన ఇందూర్/హైదరాబాద్, సెప్టెంబర్ 25:
గణేష్ నిమజ్జనాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. నిమజ్జనానికి ముందు జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పాల్గొన్నారు. NTR మార్గంలోని HYDRAA కంట్రోల్ రూమ్ వేదిక నుంచి నిమజ్జనాన్ని హైడ్రా కమిషనర్ పరిశీలించారు. హైడ్రా బోట్స్ పహారాను పరిశీలించారు.నిమజ్జనం పూర్తయ్యేవరకు అన్ని శాఖలతో హైడ్రా అధికారులు, సిబ్బంది సమన్వయంగా పని చేయాలని సూచించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో పాటు హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య, RFO ప్రకాశ్ SFO చంద్రశేఖర్ బాబు ఉన్నారు.






