Mana Indur News
స్థానిక వార్తలు

ప్లాస్టిక్‌కు బదులు జ్యూట్ బ్యాగులు వినియోగించాలి

సామాజిక కార్యకర్త పులి సాగర్

S
By S Jithendhar •September 16, 2026
9
Share
ప్లాస్టిక్‌కు బదులు జ్యూట్ బ్యాగులు వినియోగించాలి

మన ఇందూర్ ఇందల్ వాయి:

ప్లాస్టిక్‌కు బదులు జ్యూట్ బ్యాగులు వినియోగించాలని సామాజిక కార్యకర్త పులి సాగర్ సూచించారు. బుధవారం ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డి పల్లి గ్రామంలో పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సామాజిక కార్యకర్త పులి సాగర్ కోరారు. ఎల్లారెడ్డిపల్లి గ్రామ మహిళా సంఘం సభ్యులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించి, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు జ్యూట్ బ్యాగులను పంపిణీ చేశారు. పర్యావరణాన్ని కాపాడేందుకు పునర్వినియోగ వస్తువులను వినియోగించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య సంఘాల అధ్యక్షులు పూదరి శ్యామల, రోజా, రాజమణి, మంజుల, లక్ష్మి, కవిత, రాధా తదితరులు పాల్గొన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5