ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కలిగించి సేవలు పెంచండి
ట్రైనీ కలెక్టర్ సురేష్

మన ఇందూర్ నిజామాబాద్ అర్బన్
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు గురువారం ట్రైనీ కలెక్టర్ సురేష్ పామూరి వివిధ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ తెలియజేశారు. ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కలిగించి నాణ్యమైన సేవలు అందించాలని, విధుల పట్ల బాధ్యతతో వ్యవహరిస్తూ, జవాబు దారి తనం కలిగి ఉండాలని, నాణ్యమైన సమాచారము, రిపోర్టులను రికార్డులను కలిగి ఉండాలని అన్నారు. మన పరిధిలో కాపాడగలిగే ప్రతి ప్రాణాన్ని, మాతా శిశు మరణాలను కాపాడాలని అన్నారు. జిల్లా ఉప వైద్యాధికారులు, వైద్యాధికారులు, సూపర్వైజర్ అధికారులు, క్రమం తప్పకుండా ఆరోగ్య సేవలను రాండంగా పర్యవేక్షణ చేయాలన్నారు. ఏఎన్ఎంలు, ఆశాలు ప్రతిరోజు గృహ సందర్శన చేయాలని తెలియజేశారు. ప్రతి ఆరోగ్య కార్యక్రమాన్ని విడివిడిగా ప్రత్యేక ఏజెండాతో సమీక్ష నిర్వహించాలన్నారు. పీహెచ్సీ స్థాయిలో అందించే అన్ని ఆరోగ్య సేవల రికార్డులను అప్డేట్ చేయాలని, రోగ నిర్ధారణ శిబిరాలను తరచుగా నిర్వహించాలని అన్నారు. విధుల్లో ఉన్న వైద్యాధికారులపై ఎవరైనా అనుచితంగా ప్రవర్తించరాదని అట్లా ఎక్కడైనా సంభవిస్తే డిఎన్ఎచ్ఓ దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. బయో మెడికల్ జీవ వ్యర్ధాలను నియమ నిబంధనల కనుగుణంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఏజెన్సీ వాహనాలలో మాత్రమే తరలించాలని ఎక్కడపడితే అక్కడ మునిసిపల్ చెత్త చెదారంలో వేయరాదన్నారు. ప్రతి ఆశ తన యొక్క విధుల గురించి తెలుసుకోవాలని, పీహెచ్సీల వారీగా సోషల్ మీడియా అకౌంట్లో నిర్వహించిన కార్యక్రమాలను పోస్ట్ చేయాలన్నారు. ఏఎన్ఎం మరియు అంగన్వాడి కార్యకర్తల మధ్య సమన్వయం పెంచుతూ శ్యామ్ మామ్ చిన్నారులను గుర్తించి, జి జి హెచ్ లోని ఎన్ఆర్సికి రిఫర్ చేసి చికిత్స అందించడమే కాకుండా వారిని ఫాలో అప్ చేయాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ గారు మాట్లాడుతూ ట్రైనీ కలెక్టర్ గారు సూచించిన ప్రతి అంశాన్ని పరిశీలించి ప్రతి పీహెచ్సీ పరిధిలో అమలుపరుస్తామని తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రుల సూపరిండెంట్ (డిసిహెచ్ఎస్) డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, జిల్లా ఉప వైద్యాధికారులు డాక్టర్ విద్య డాక్టర్ రవీందర్ డాక్టర్ సికందర్ వివిధ ఆరోగ్య కార్యక్రమాల ప్రోగ్రాం అధికారులు, వివిధ పీహెచ్సీల వైద్యాధికారులు పాల్గొన్నారు. #






