Mana Indur News
స్థానిక వార్తలు

చంద్రాయన్‌పల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

కార్యక్రమంలో సర్పంచ్ అరటి రఘు, ఉపసర్పంచ్ సంజీవ్ గౌడ్

S
By S Jithendhar •September 17, 2026
16
Share
చంద్రాయన్‌పల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

మన ఇందూర్ ఇందల్వాయి :

చంద్రాయన్‌పల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించినట్లు
సర్పంచ్ అరటి రఘు, ఉపసర్పంచ్ సంజీవ్ గౌడ్ తెలిపారు. గురువారం ఇందల్వాయి
మండలంలోని చంద్రాయన్‌పల్లి గ్రామపంచాయతీ పరిధిలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ అరటి రఘు, ఉపసర్పంచ్ సంజీవ్ గౌడ్ పాల్గొని లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత సులభంగా అందేలా స్మార్ట్ రేషన్ కార్డులు ఉపయోగపడతాయని వారు తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్‌ సరుకులు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో రేషన్ డీలర్ కాశీనాథ్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి అరుణ, వార్డు సభ్యులు సతీష్, బాలయ్య, కిష్టయ్య, లక్ష్మీలత, దేవగౌడ్, నర్సయ్య, రాజన్న, నరేష్, భూమయ్య, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌గౌడ్, రవి, ఆశన్న, కుమ్మరి గంగాధర్, సాయికుమార్, రాకేష్, అంగన్‌వాడీ టీచర్లు మంజుల, వినోద, ఆశా వర్కర్ సుశీల తదితరులు పాల్గొన్నారు. అలాగే స్కూల్ విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అరటి రఘు, ఉపసర్పంచ్, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5