జి.జి కళాశాలలో డిగ్రీ స్పాట్ అడ్మిషన్స్
26 తేదీన సీట్ల కేటాయింపు

ఇందూర్ /నిజామాబాద్ అర్బన్:
2026-27 విద్యాసంవత్సరం గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి) నిజామాబాద్ నందు స్పాట్ అడ్మిషన్స్ కోసం ఆసక్తి గల విద్యార్థులు సెప్టెంబర్ 24, 25 తేదీలలో లోకల్ విద్యార్థులు ఒరిజినల్ ఎస్.ఎస్.సి, ఇంటర్ మార్క్ మెమోలు, టి సి, కులం, ఆదాయం, ప్రత్యేక కేటగిరీ సంబంధిత సర్టిఫికెట్లను జత చేసి కళాశాలోనే దరఖాస్తు చేసుకోవాలి. 26 వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుంది. నాన్ లోకల్ విద్యార్థులు 28, 29 తేదీలలో దరఖాస్తు చేసుకోవాలి, వారికి 30వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుందని, స్పాట్ అడ్మిషన్ పొందినవారు పూర్తి ఫీజు చెల్లించవలసి ఉంటుంది. స్కాలర్ షిప్ అర్హత ఉండదని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి రామ్మోహన్ రెడ్డి తెలిపారు.
ఖాళీల వివరాలు:
బి.కాం సీ.ఏ 01, టాక్సేషన్ 01, మల్టీబుల్ డిసబిలిటీ చొప్పున బి.కాం లో (2),ఖాళీలు ఉన్నాయి. బి.సి.ఏ. లో ఆటిజం ఫిమేల్ 01, బి. ఏ. ఇంగ్లీష్ మీడియం లోకో డిసబిలిటీ ఫిమేల్01, మల్టీబుల్ డిసబిలిటీ 01, బి. ఏ. స్పెషల్ ఆటిజం ఫిమేల్ 01, బి. ఏ. తెలుగు మీడియం బి.సి.బి. ఫిమేల్ 01, చొప్పున *బి.ఏ.లో మొత్తం (04) ఖాళీలు ఉన్నాయి. బి. ఎస్సీ. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో బ్లైండ్నెస్ ఫిమేల్ 01, బి. ఎస్సీ. హెల్త్ కేర్* లో మల్టీబుల్ డిసబిలిటీ జనరల్ 01, ఫిమేల్ 01, ఆటిజం 01, చొప్పున (3) ఖాళీలు ఉన్నాయి. బి.ఎస్సీ. లైఫ్ సైన్సు లో డెఫ్ హియరింగ్ జనరల్ 01, ఫిమేల్ 01, లోకో జనరల్ 02, ఫిమేల్ 01, ఆటిజం జనరల్ 01, ఆటిజం ఫిమేల్ 01, మల్టీబుల్ డిసబిలిటీ జనరల్ 02, ఫిమేల్ 01 చొప్పున మొత్తం లైఫ్ సైన్సులో(10) ఖాళీలు ఉన్నాయి.
బి.ఎస్సీ.ఆనర్స్ ఎస్సీ2 జనరల్ 04, ఎస్టీ జనరల్ 03, ఫిమేల్ 01, ఎన్సిసి జనరల్ 01, క్యాప్ ఫిమేల్ 01, లోకో, ఫిమేల్ 01, మల్టీబుల్ డిసబిలిటీ ఫిమేల్01, ఈసీ ఫిమేల్ 01, డెఫ్ హియరింగ్ జనరల్ 01, చొప్పున (14) ఖాళీలు ఉన్నాయి. పై వివరాల ప్రకారం రిజర్వేషన్ ఆధారంగా ఖాళీలు నింపబడుతాయి. అభ్యర్థులు లేని పక్షంలో నిబంధనల ప్రకారం సీట్లు కేటాయించబడతాయి.పూర్తి వివరాలకు కళాశాలను సంప్రదించాలని తెలిపారు.






