Mana Indur News
క్రీడలు

నిజామాబాద్ అర్బన్ వాలీబాల్ జట్ల ఎంపిక పూర్తి

అర్బన్ అసోసియేషన్ అధ్యక్షుడు అజ్మత్ ఖాన్

MI
By Mana Indur News•November 2, 2026
1
Share
నిజామాబాద్ అర్బన్ వాలీబాల్ జట్ల ఎంపిక పూర్తి

నిజామాబాద్ అర్బన్ వాలీబాల్ జట్ల ఎంపిక పూర్తి

మన ఇందూర్ న్యూస్/నిజామాబాద్ అర్బన్:

నిజామాబాద్ స్పోర్ట్స్, నవంబర్ 02:

నిజామాబాద్ అర్బన్ పరిధిలో అండర్‌-14, అండర్‌-17 బాలబాలికల వాలీబాల్ జట్ల ఎంపికలు సోమవారం నగరంలోని డీఎస్‌ఏ మైదానంలో నిర్వహించారు. ఈ ఎంపికల్లో అర్బన్ పరిధిలోని వివిధ పాఠశాలలకు సంబంధించిన సుమారు 160 మంది బాలురు, 150 మంది బాలికలు పాల్గొన్నారు. వీరిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ అసోసియేషన్ అధ్యక్షుడు అజ్మత్ ఖాన్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ (హాకీ) నిజామాబాద్ అర్బన్ జోనల్ ఇన్‌చార్జి నరేందర్ చారి మాట్లాడుతూ.. మంగళవారం జరగనున్న జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌లో అర్బన్ జట్టు క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ జోనల్ ఇన్‌చార్జి నరేందర్ చారి, కోశాధికారి గంగామురళి తో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు సంతోష్, మురళి, శ్రీనివాస్, శ్యామ్, విజయలక్ష్మి, నాగరాజ్, సూరజ్, సాయి, మహిపాల్, బాలరాజు, ప్రియాంక తదితరులు ఎంపికలను పర్యవేక్షించారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5