Mana Indur News
స్థానిక వార్తలు

అక్రమంగా చెట్ల నరికివేత.. కేసు నమోదు

ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సురేందర్, బీట్ ఆఫీసర్ సతీష్‌ తనిఖీలు

KA
By KARKA RAMESH•September 17, 2026
3
Share
అక్రమంగా చెట్ల నరికివేత.. కేసు నమోదు

మన ఇందూర్ ఇందల్వాయి:

సాంపల్లి గ్రామ శివారులో అక్రమంగా చెట్లను నరికివేసిన ఘటనను అటవీ అధికారులు గుర్తించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవి మోహన్ భట్ ఆదేశాల మేరకు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సురేందర్, బీట్ ఆఫీసర్ సతీష్‌ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాంపల్లి గ్రామానికి చెందిన మసూరి ప్రశాంత్‌కు చెందిన పట్టా భూమిలో సుమారు 10 టేకు, 2 నాన్‌ టేకు చెట్లను నరికివేసినట్లు గుర్తించారు. అనుమతి లేకుండా చెట్లను నరికివేయడం నేరమని అధికారులు తెలిపారు. వాల్టా చట్టం-2002 ప్రకారం కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అక్రమంగా చెట్లను నరికినా, వాటికి నష్టం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ అధికారులు హెచ్చరించారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5