Mana Indur News
కల్చరల్

శివాజీ గణేష్ మండలి గణేశుని దర్శించుకున్న బాజిరెడ్డి జగన్

శివాజీ గణేష్ మండలి 6 వ వార్షికోత్సవం సందర్భంగా మహా అన్నప్రసాద కార్యక్రమం

KA
By KARKA RAMESH•September 21, 2026
5
Share
శివాజీ గణేష్ మండలి గణేశుని దర్శించుకున్న బాజిరెడ్డి జగన్

మన ఇందూర్ / నిజామాబాద్ అర్బన్

జిల్లా కేంద్రంలోని నాలుగవ డివిజన్ ఈస్ట్ బ్యాంక్ కాలనీలో ఏర్పాటుచేసిన శివాజీ గణేష్ మండలి గణనాథున్ని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ బాజిరెడ్డి జగన్ సోమవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం శివాజీ గణేష్ మండలి 6 వ వార్షికోత్సవం సందర్భంగా మహా అన్నప్రసాద కార్యక్రమం చేపట్టారు.కార్యక్రమంలో పాల్గొన్న బాజిరెడ్డి జగన్ ను గణేష్ మండలి సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ కాలనీలోని యువత ముఖ్యంగా చిన్నపిల్లలు గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దేవేందర్, బీఆర్ఎస్ పార్టీ నాల్గవ డివిజన్ నాయకుడు మల్లెపూల నరసింహ చారి,అరుణ్, భరత్, ధనుష్ రెడ్డి, వెంకటేష్,సిద్ధార్థ్, స్వరణ్, సంకిర్థ్, చరణ్, కార్తికేయ, సుప్రీత్,సుశ్రీత్,కాలనీ మహిళలు,తదితరులు పాల్గొన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5