Mana Indur News
స్థానిక వార్తలు

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ప్రారంభించిన ఉపసర్పంచ్ కుంట రమేష్

S
By S KISHOR •October 3, 2026
6
Share
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

మన ఇందూర్ /భీమ్‌గల్ రూరల్ :

భీమ్‌గల్ మండలం మెండోరా గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఉపసర్పంచ్ కుంట రమేష్ ప్రారంభించారు.ఈ సంవత్సరం జిల్లాలో రైతులు ముందుగానే వరి నాట్లు వేయడంతో ప్రభుత్వం రైతులకు ఇబ్బంది కలగకుండా అక్టోబర్ నెల నుండే కొనుగోలు కేంద్రం ప్రారంభించామని ఉపసర్పంచ్ రమేష్ తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా కొనుగోలు కేంద్రాలను వినియోగించుకొని,ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర,బోనస్ ను పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఐకెపి సీసీ రఘు,శ్రీనివాస్,మహిళా సమాఖ్య వివోఏలు శిరీష,పుష్ప కార్యదర్శి రాజేందర్,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, నాయకులు పల్లె శేఖర్,మాజీ సర్పంచ్ రాజేందర్ మాజీ ఎంపిటిసి ఆరే రవీందర్ రైతులు,గ్రామస్తులు పాల్గొన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5