మేదరి కులస్తుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు కృషి చేయాలి
శ్రీ కేతయ్య స్వామి విగ్రహానికి పూలమాలలు వేసిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు

మన ఇందూర్ నిజామాబాద్ అర్బన్
మేదరి కులస్తుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు కృషి చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. శుక్రవారం ప్రపంచ వెదురు దినోత్సవ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక నగర్ విగ్రహాల పార్కులో గల మహేంద్రుల ఆరాధ్య దైవం శ్రీ కేతయ్య స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి ప్రపంచ వెదురు దినోత్సవ వేడుకలను బీసీ సంక్షేమ సంఘం నాయకులు మహేంద్ర సంఘం జిల్లా నాయకులు. చేతి వృత్తిదారులైన మహేంద్రులకు ఎన్నో సమస్యలు ఉన్నాయని వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు కృషి చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. హరితహారం లో వెదురుని ప్రోత్సహించాలి, అడవులకు రక్షణగా వెదురు వృక్షాలను పెంచాలి, అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో మహేంద్రు లకు ఒక ఐదు ఎకరాల భూమి కేటాయించి దానిలో వెదురు పంటను పండించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఒక్కసారి వెదురు పంట కొస్తే దాదాపు 50 సంవత్సరాలు వెదురుని పండించవచ్చని అన్నారు. నాణ్యమైన వెదురు దొరకక మహేంద్రలు చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అస్సాం రాష్ట్రం లాంటి సుదూర ప్రాంతాల నుండి వెదురుని తేవడానికి రవాణా ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయని అన్నారు. మహేంద్రుల చేతి వృత్తిని బ్రతికించాలంటే ప్రభుత్వాలు ప్రతి నియోజకవర్గంలో ఒక అయిదు ఎకరాలు కేటాయించి అందులో వెదురు చెట్లను పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ తో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్స ఆంజనేయులు, దర్శనం దేవేందర్, బగ్గలి అజయ్, చంద్రకాంత్, శ్రీలత, పద్మ, బాలన్న, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు






