ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దుదాం.
సుద్దపల్లి గ్రామ పంచాయతీ పాలక వర్గం ఒక కొత్త ఆలోచన

ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దుకుందామని ఉప సర్పంచ్ క్రాంతి కుమార్ అన్నారు. మంగళవారం సుద్దపల్లి గ్రామ పంచాయతీ పాలక వర్గం ఒక కొత్త ఆలోచన తో ముందుకు వచ్చామన్నారు. సుద్దపల్లీ గ్రామంలో పేపర్ ప్లేట్లను పూర్తిగా నిషేధించారు. వాటికి బదులు స్టీల్ ప్లేట్లు స్టీల్ గ్లాసు ప్రతి అన్నదాన కార్యక్రమంలో వీటినే ఉపయోగించాలని తెలిపారు. ఈ రోజు నుంచి స్టీల్ ప్లేట్లు దాతల సహాయం తో కొనుగోలు చేశామని సర్పంచ్ రూపా సతీష్ రెడ్డి, ఉప సర్పంచ్ క్రాంతి కుమార్ తెలిపారు. ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్లాస్టిక్‌ను నిర్మూలిద్దాం ఆరోగ్యంగా ఉందాం అనే సంకల్పం తో ముందుకు వెళ్తున్నామని, దీనికి గ్రామంలో ఉన్న యువకులు ప్రజలు పెద్ద ఎత్తున సహరించాలని తెలిపారు.. ఈ యొక్క కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు దుంపటి భూమయ్య ప్రధాన కార్యదర్శి లక్మన్, వార్డు సభ్యులు చిరంజీవి నవీన్ గ్రామస్తులు వినోద్ రెడ్డి,ఆరెపల్లి మోహన్ ,గణేష్ , సంతోష్, రణదీప్,ప్రసాద్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు...






