Mana Indur News
స్థానిక వార్తలు

విడిసిలా ఆగడాలు అరికట్టెల జిల్లా అధికారులు చొరవ చూపాలి

తాళ్ళ రాంపూర్ విడిసి వ్యవస్త రద్దు చేసి బాదితులకు న్యాయం చేయాలి.. గౌడ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజా గౌడ్, కోశాధికారి లక్ష్మణ్..

KA
By KARKA RAMESH•September 27, 2026
137
Share
విడిసిలా ఆగడాలు అరికట్టెల జిల్లా అధికారులు చొరవ చూపాలి

విడిసిలా ఆగడాలు అరికట్టెల జిల్లా అధికారులు చొరవ చూపాలి

తాళ్ళ రాంపూర్ విడిసి వ్యవస్త రద్దు చేసి బాదితులకు న్యాయం చేయాలి

గౌడ కులస్తులను ఇబ్బంది పెడితే సహించేది లేదు

రెండవ సారి సాంఘిక బహిష్కరణ చేయడం అమానుషం

మన ఇందూర్ నిజామాబాద్ అర్బన్

తాళ్ళ రాంపూర్ లో గౌడ , ఎస్సీ కులస్తులను సాంఘిక బహిష్కరణ చేయడం సరికాదని, విడిసిలా ఆగడాలు అరికట్టెల జిల్లా అధికారులు చొరవ చూపాలని గౌడ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజా గౌడ్, కోశాధికారి లక్ష్మణ్ గౌడ్ అన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో గౌడ సంఘం అధ్వర్యంలో తాళ్ళ రాంపూర్ బాధితులకు మద్దతుగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ళ రాజా గౌడ్ మాట్లాడుతూ.. ఎర్గట్ల మండలంలో తాళ్ళ రాంపూర్ గ్రామంలో విడిసి ఆగడాలు శృతి మించుతున్నాయన్నారు. 32 మంది గౌడ కులస్తులను కావలని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. 10 మంది 10 మంది ఎస్సీ కులస్తులను కూడా బహిష్కరణ చేయడం చూస్తుంటే విడిసి లు ఇంతకు దిగజారారో అర్థమవుతుందన్నారు. విడిసి లకు ఎలాంటి చట్టబద్ధత లేకున్నప్పటికీ, చట్టాన్ని చేతులకు తీసుకొని ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఇలాంటి వీడిసిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. భవిష్యత్ లో ఇలాంటివి జరగకుండా రేపు అన్ని మండలాల్లో తహసీల్దార్ లకు వినతి పత్రాలు ఇస్తామని అన్నారు.

గౌడ సంఘం కోశాధికారి లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ... గౌడ కులస్తులను రెండవ సారి బహిష్కరణ చేయడం సిగ్గు చేట అని, గౌడ కులస్తులతో ఎవరైనా మాట్లాడితే 25 వేలు జరిమానా విధించడం అనేది రాజ్యాంగాన్ని అతిక్రమంచడమే అన్నారు. గ్రామాభివృద్ధి కోసం మాత్రమే ఏర్పాటు చేసుకున్న విడిసి లు, చట్టానికి తీసుకోవడం సరికాదన్నారు. కొన్ని గ్రామాలలో అభివృద్ధి లక్ష్యంగా పనిచేసినప్పటికీ, తాళ్ల రాంపూర్ లాంటి విడిసి లతో అందరికీ చెడ్డ పేరు వస్తుందన్నారు.గ్రామాభివృద్ధి కమిటీలు ఎక్కడ లేవని, కేవలం నిజామాబాద్ జిల్లాలోనే ఉన్నాయన్నారు.వృత్తి మీద ఆధారపడుతున్న గౌడ కులస్తులను ఇబ్బందులకు కూడా చేస్తే చూస్తూ ఊరుకోమని, ఒకే గ్రామంలో రెండుసార్లు సాంఘిక బహిష్కరణ చేయడం అంటే ఇది మామూలు విషయం కాదన్నారు. గ్రామాల్లో గౌడ కులస్తులు అభివృద్ధి లో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ కొందరు కావాలని కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరికాదన్నారు. గౌడ వ్యవస్త మీద విడిసి ఆగడాలు శృతి మించు తున్నాయన్నారు. గ్రామంలో చెప్పినట్లు వినకుంటే ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.

ఈ విలేకరుల సమావేశంలో..ఇందల్ వాయు మండలం అద్యక్షులు శ్యామ్ సుందర్ గౌడ్, రూరల్ మండలం పరుశురాం గౌడ్, మోపాల్ మండలం నర్స గౌడ్, చంద్రం గౌడ్, రామ గౌడ్, రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5