Mana Indur News
కల్చరల్

యావత్ తెలంగాణకు స్పూర్తినిచ్చిన చాకలీ ఐలమ్మ

నివాళులు అర్పించిన బిసి సంక్షేమ సంఘం నాయకులు.

KA
By KARKA RAMESH•September 26, 2026
4
Share
యావత్ తెలంగాణకు స్పూర్తినిచ్చిన చాకలీ ఐలమ్మ

మన ఇందూర్/ నిజామాబాద్ అర్బన్:

సాయుధ పోరాట యోధురాలు, బీసీల నిప్పు కణిక, ధీశాలి, తెలంగాణ ధీర వనిత, కేవలం మహిళా లోకానికే కాకుండా యావత్ తెలంగాణకు స్పూర్తినిచ్చిన చాకలీ ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా వినాయక నగర్ లోని హనుమాన్ జంక్షన్ వద్ద మహనీయుల పార్కులో గల చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించిన బిసి సంక్షేమ సంఘం నాయకులు. బీసీలు తిరగబడితే దేన్నైనా సాధించవచ్చని ఐలమ్మ చరిత్రే నిదర్శనం. దున్నేవాడిదే భూమి అనే నినాదంకు జన్మనిచ్చిన తల్లి ఐలమ్మ. ఇప్పటికైనా బీసీలు మేలుకొని తమను తాము పరిపాలించు కోవాలని బిసి సంక్షేమ సంఘం పిలుపునిచ్చింది. ఆ రోజు దేశ్ముఖ్ లను, రజాకార్లకు పరిగెత్తించిన ఐలమ్మ యొక్క తెగింపును వారసత్వంగా బీసీలు ఎంచుకుని ముందుకు సాగాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. ఒక్క వీరనారి కొన్ని వేల ఎకరాల భూమిని ప్రజలకు చెందే విధంగా చూడడం ఒక గొప్ప విషయం, తన నాలుగెకరాల భూమిని కాపాడుకోవడమే కాకుండా వేల మందికి భూమిని చెందే విధంగా చూసిన నాయకురాలు గొప్ప ధీశాలి చాకలి ఐలమ్మ. ఆమె చివరి శ్వాస వరకు కూడా బడుగు బలహీన వర్గాల కొరకు శ్రమించింది ఆమె బాటలో పయనించి బీసీలు తమ హక్కులను సాధించుకుంటారని ఈ సందర్భంలో చెప్పడం జరిగింది.. ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్, ఆకుల ప్రసాద్, ధర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, కరిపె రవిందర్, అపర్ణ, చంద్రకాంత్, సాయి బసవ, బాలయ్య, శ్రీనివాస్, గంగాధర్, సురేందర్, అనిల్ సత్యనారాయణ, అంకంరావు తదితరులు పాల్గొన్నారు.

#చాకలి ఐలమ్మ.

#సాయుధ పోరాట యోధురాలు, బీసీల నిప్పు కణిక.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5