బోధన్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గణేష్ జాదవ్‌కు ఘన సన్మానం
గ్రామాభివృద్ధి, రైతు సంక్షేమం కోసం గణేష్ జాదవ్ సేవలు

బోధన్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గణేష్ జాదవ్‌కు ఘన సన్మానం
మన ఇందూర్ న్యూస్ / బోధన్ :
కునేపల్లి మండల పరిధిలోని విరన్నగుట్ట తండా మాజీ సర్పంచ్ గణేష్ జాదవ్ ఇటీవల బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా నియమితులైన సందర్భంగా గ్రామ ప్రజలు ఆయనను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు గణేష్ జాదవ్‌కు పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించి తమ అభినందనలు తెలియజేశారు. బోధన్ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా నియామకం కావడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, రైతుల సంక్షేమం కోసం ఆయన కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కునేపల్లి గ్రామ సర్పంచ్ ఈ.మల్లేష్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్,మాజీ సర్పంచ్ రొడ్డ లింగం, కిసాన్ తండా సర్పంచ్ విజయ్‌తో పాటు గ్రామ పెద్దలు లక్ష్మణ్ , దేవీదాస్ , సెక్రటరీ సాయిలు, డప్పు సాయిలు పాల్గొన్నారు.గ్రామాభివృద్ధి, రైతు సంక్షేమం కోసం గణేష్ జాదవ్ సేవలు మరింత విస్తృతంగా కొనసాగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.తనను మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా నియమించినందుకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.






