భగవాన్ శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞం మహోత్సవం
జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా యజ్ఞం మహోత్సవం
KA
By KARKA RAMESH•September 17, 2026
0

మన ఇందూర్ నిజామాబాద్ అర్బన్ :
భగవాన్ శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమం ఐడిఓసి కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ భుజంగరావు హాజరై, భగవాన్ శ్రీ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. విశ్వ బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ గీత, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులు, విశ్వకర్మ కుల సంఘాల ప్రతినిధులు, వివిధ కుల సంఘాల నాయకులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.






