Mana Indur News
కల్చరల్

ఆకట్టుకున్న రైతు శివపుత్ర గణేష్ మండలి

దేశం కోసం రైతు.. రైతు కోసం ఎవరు? సంస్కార భారతి మెప్పు పొందింది.

KA
By KARKA RAMESH•September 25, 2026
175
Share
ఆకట్టుకున్న రైతు శివపుత్ర గణేష్ మండలి

ఆకట్టుకున్న రైతు శివపుత్ర గణేష్ మండలి

దేశం కోసం రైతు.. రైతు కోసం ఎవరు?

మన ఇందూర్/నిజామాబాద్ అర్బన్:


నిజామాబాద్ నగరంలోని ఖిల్లా రోడ్డు లో గల శ్రీ
శివపుత్రు గణేష్ మండలి ఆధ్వర్యంలో చేపట్టిన శోభా యాత్ర అందరినీ ఆకట్టుకుంది. జై జవాన్..జై కిసాన్ అంటూ.. గ్రామంలో ఉన్న పచ్చని ప్రకృతి తో రైతు కు సంబంధించిన  కొట్టం, బోరు బావి, పెంట, ఎడ్ల బండి, పంట పొలం, గ్రామ దేవతలు. దేశం కోసం రైతు.. రైతు కోసం ఎవరు ? అంటూ.. రైతు చేసే సేవను.. అందరికీ అర్థం అయ్యేలా ప్ల కార్డులతో రైతు కండువా వేసుకొని భక్తి తో తలుస్తూ నిమర్జనం కోసం వెళ్తుంటే కన్నుల పండుగగా అనిపించింది.

సంస్కార భారతి మెప్పు పొందింది
దేశం కోసం రైతు.. రైతు కోసం ఎవరు? అంటూ చక్కని అలంకరణతో ఆకట్టుకున్న శివపుత్ర గణేష్ మండలిని అద్యక్షులు రాజ్ కుమార్ సుభేదార్, గంట్యాల ప్రసాద్,  శ్రీనివాస్ రెడ్డి సభ్యులు అభినందించారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5