సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
పిప్రి గ్రామంలో సర్పంచ్ అరిగేలా జనార్ధన్,ఉపసర్పంచ్ జేమ్స్ చేతుల మీదుగా రూ.2,10,000 ల విలువైన చెక్కుల పంపిణీ

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
మన ఇందూర్/భీమ్‌గల్ రూరల్ :
భీమ్‌గల్ మండలంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అనారోగ్య బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జీ ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను గురువారం సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ పిప్రి గ్రామంలో సర్పంచ్ అరిగేలా జనార్ధన్,ఉపసర్పంచ్ జేమ్స్ చేతుల మీదుగా ఏడుగురు లబ్ధిదారులకు మొత్తం రూ.2,10,000 ల విలువైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ జనార్ధన్ సూచించారు.ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేని పేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ ఆర్థికంగా అండగా నిలుస్తుందని,సహాయాన్ని అందించిన ఇంచార్జీ ముత్యాల సునీల్ కుమార్ కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,పార్టీ కార్యకర్తలు,గ్రామస్థులు పాల్గొన్నారు.






