స్నేహ సొసైటీ లో ఘనంగా పండిత్ ధీన్ దయాళ్ జయంతి వేడుకలు
సమాజంలో కడపటి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందాలనే 'అంతోదయ, ఏకాత్మ మానవ దర్శనం సిద్ధాంతాలను దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించారు.

.
మన ఇందూర్/నిజామాబాద్ అర్బన్:
సమాజంలో కడపటి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందాలనే 'అంతోదయ, ఏకాత్మ మానవ దర్శనం సిద్ధాంతాలను దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించారని నగర మేయర్ కూరగాయల ఉమారాణి అన్నారు. కమ్యూనిజం, క్యాపిటలిజం పెట్టుబడిదారీ విధానం కాకుండా భారత్కు తగిన ప్రత్యామ్నాయ ఆలోచనా విధానాన్ని అందించారన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ దివ్యంగుల పాఠశాల ఆవరణలో పండిత్ దీన్ దయాల్ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ ఉమారాణి నూడా చైర్మన్ కేశవేణు హాజరై పండిత్ దీన్ దయాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు..ముందుగా స్నేహ సొసైటీ ఏర్పాటు ఏ విధంగా జరిగింది. ఇప్పటి వరకు ఎంత మంది దివ్యంగ విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, వారి ఆరోగ్య పరిస్థితులను ప్రతి విషయాన్ని స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్దయ్య, ప్రిన్సిపాల్ జ్యోతి క్లుప్తంగా ముఖ్య అతిథులకు,పలు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయ సిబ్బందికి వివరించారు.
అంధ,మానసిక దివ్యంగా విద్యార్థులకు నేనున్నానంటూ మనోధైర్యం కల్పిస్తూ వారి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తున్న స్నేహ సొసైటీ దివ్యంగ పాఠశాల కార్యదర్శి సిద్దయ్య, ప్రిన్సిపాల్ జ్యోతి, సిబ్బందిని పండిత్ ధిన్ దయాళ్ జయంతి వేడుకల్లో నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి, నూడ చైర్మన్ కేశవేణు లు అభినందించారు.తమ వంతు బాధ్యతగా మానసిక దివ్యంగ విద్యార్థుల ఉన్నతి కోసం తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని వారు చెప్పారు.అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో నగర మేయర్ కూరగాయల ఉమారాణి మాట్లాడుతూ..స్నేహ సొసైటీని 1995 లో నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసి నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎంతోమంది దివ్యాంగ విద్యార్థుల ఉన్నతి కోసం పాటుపడడం స్నేహ సొసైటీ వ్యవస్థాపకులు ఎస్. సిద్ధయ్య, జ్యోతి దంపతులకే దక్కిందన్నా రు. అంధ, మానసిక, దివ్యంగ విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపుతూ నేనున్నానంటూ ఆకున్న చేర్చుకొని వారి భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేస్తూ, వారి జీవితాల్లో బంగారు బాటాలు వేస్తూ కృషి చేయడం ఎంతో అభినందించదగ్గ విషయమన్నారు.ఇప్పటివరకు ఎంతోమంది దివ్యాంగ విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించి పాఠశాలతో పాటు జిల్లాను గర్వించదగ్గ స్థాయిలో ఉంచారని కొనియాడారు. ముందే పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఈ కార్యక్రమానికి రావడం పట్ల దివ్యాంగ విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలు తిలకించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు.దివ్యంగ విద్యార్థులు అయినప్పటికీ కూడా వారు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గురించి లూయీ బ్రెయిలీ ద్వారా నేర్చుకున్న వారి జీవిత చరిత్రను ఇతర విషయాలను క్లుప్తంగా వివరించడం ఎంతో గొప్ప విషయం అన్నారు. కంటిచూపు లేనప్పటికీ స్పర్శ ద్వారా చదువుతోపాటు సాంస్కృతిక నృత్యాలు, పాటలు , యోగ చేయడం ఎంతో గొప్ప విషయం అని అన్నారు.. ఇంతగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న స్నేహ సొసైటీ నిర్వాహకులు, ఉపాధ్యాయ సిబ్బందిని ప్రతి ఒక్కరిని అభినందించారు... ఈ కార్యక్రమంలో పలు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు సైతం ప్రదర్శనలు నిర్వహించారు..ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులను శాలువాలు, జ్ఞాపికాలతో ఘనంగా సన్మానించారు. స్నేహ సొసైటీ కి ఏ బి ఎస్ నుంచి ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్దయ్య, అందుల ప్రత్యేక పాఠశాల పాఠశాలల ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
#sneha society.
#దీన్ దయాళ్.






