Mana Indur News
క్రీడలు

గణేష్ మండలి ఆధ్వర్యంలో గణనాథునికి ప్రత్యేక పూజలు.

లోగల శివపుత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో గణనాధునికి ప్రత్యేక పూజలు

KA
By KARKA RAMESH•September 21, 2026
1
Share
గణేష్ మండలి ఆధ్వర్యంలో గణనాథునికి ప్రత్యేక పూజలు.

మన ఇందూర్ నిజామాబాద్ అర్బన్:

నగరంలోని వివేకానంద కాలనీ లోగల శివపుత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురుమంచి అనంత శ్రీవాత్సవ అన్నప్రసాద ధాత గా ఉన్నారని, గురుమంచి శేఖర్ మాధవి లు ప్రత్యేక పూజ నిర్వహించి అన్నదాన కార్యక్రమం లో దాతలుగా సహకరించగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.అర్చకులు రాఘవ ఆధ్వర్యంలో గణనాధునికి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గురు మంచి శేఖర్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ గురు మంచి శేఖర్ సందర్భంగా మాట్లాడుతూ గణనాధునికి పూజా కార్యక్రమంలో పాల్గొన్న వారికి సహకరించిన వారికి ఆ వినాయకుని కృప కటాక్షాలు ఉంటాయని తెలిపారు. శివపుత్ర గణేష్ మండలి నిర్వాహకులు గురుమంచి భార్గవ్ మాట్లాడుతూ 25 సంవత్సరాల నుంచి వినాయకుని పూజిస్తున్నామని అన్నారు. వెండి వినాయకుని ప్రత్యేకంగా తయారు చేయించి పూజలు చేస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం విగ్రహ దాతలు శ్రీధర లక్ష్మి ఆర్య, శ్రీధర శ్రీ ఆగస్త్య, లడ్డు దాతలుగా కళా సునీత కళ పట్టు వర్ధన్ ఉన్నారని తెలిపారు. వినాయకుని కృపా అందరి పై ఉండాలని అన్నారు..ఈ కార్యక్రమంలో శివపుత్ర గణేష్ మండలి సభ్యులు భార్గవ్, సంతోష్ సందీప్, ప్రేమ్ సాయి, వంశీధర్ రాజు, గౌతం నంద, వంశీ కన్నా, కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5