Mana Indur News
కల్చరల్

ఇందూరు పై గణనాథుని ఆశీర్వాదం ఎల్లపుడు ఉండాలి

సంస్కార భారతి కార్యక్రమాలు భేష్. అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

KA
By KARKA RAMESH•September 25, 2026
25
Share
ఇందూరు పై గణనాథుని ఆశీర్వాదం ఎల్లపుడు ఉండాలి

ఇందూరు పై గణనాథుని ఆశీర్వాదం ఎల్లపుడు ఉండాలి

సంస్కార భారతి కార్యక్రమాలు భేష్

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

మన ఇందూర్/నిజామాబాద్ అర్బన్:

ఇందూరు పై గణనాథుని ఆశీర్వాదం ఎల్లపుడు ఉండాలి అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం సంస్కార భారతి ఇందూరు ( కళ, సాహిత్య రంగంలో పని చేస్తున్న అఖిల భారత సంస్థ) నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమం నగరంలోని గోల్ హాన్ మాన్ వద్ద వినాయక మండపాల కు స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పది రోజుల క్రితం గణనాథుని ప్రతిష్టించి భక్తి తో పూజలు నిర్వహించి, ఈ రోజు దుబ్బ ప్రాంతం నుంచి వినాయక నగర్ వినాయకుల భావి వద్దకు శోభాయాత్ర తో భక్తి శ్రద్ధలతో వెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వినాయకులకు స్వాగతం పలుకుతూ సంస్కారం భారతి సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయం అన్నారు. 1990 నుంచి సంస్కార భారతి ఆధ్వర్యంలో గోల్ హనుమాన్ చౌరస్తాలో గణనాథులను స్వాగతిస్తూ కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ సంస్థ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. స్వాతంత్ర ఉద్యయంలో స్పూర్తి నింపేందుకు గణపతి ని ప్రతిష్ట చేయడంతో ఐకమత్యంగా వెల్లివిరిసిందన్నారు. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా వినాయక చవితిని జరుపుకుంటామన్నారు. దేశంలో కులాల మతాలకు అతీతంగా రాజకీయాలకతీతంగా ఈ పండగను జరుపుకుంటామన్నారు. గణనాథుని ఆశీర్వాదం అందరిపై ఉంటే జీవితంలో సుఖ సంతోషాలతో ఉంటామన్నారు. ఎన్ నీ నో తో రైతులు కొంత ఇబ్బంది పడుతున్నారని, పంటలు పండే వరకు వర్షాలు సంవృద్ధిగా కురవాలని, రైతు బాగుంటే దేశం బాగుంటుందని, దేశం బాగుంటే మనమంతా బాగుంటామన్నారు. గణేశుని నిమజ్జనం ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పూర్తి చేసుకోవాలని వినాయక మండళ్లకు సూచించారు.ఇలాంటి కార్యక్రమము ఏర్పాటు చేసిన సంస్కార భారతి కార్యక్రమాలు భేష్ అని, సభ్యులందరిని అభినందిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో సాహిత్యవిభాగం రాష్ట్ర కన్వీనర్ గంట్యాల ప్రసాద్, ప్రాంత కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, అధ్యక్షులు రాజ్ కుమార్ సుభేదార్, మహానగర ప్రధాన కార్యదర్శి మాధురి, ఇందూర్ జిల్లా కన్వినర్ నగుర్థి శంకర్, కోశాధికారి రాధా కృష్ణ, ఉపాధ్యక్షులు రమణ చారి, బున్ని మల్లేష్, నాగనాథ్ గుప్త ఉపాధ్యక్షులు, బెజగం శ్రీకాంత్ ప్రచార ప్రముఖ్ సాయి రెడ్డి, వరలక్ష్మీ మాతృశక్తి కన్వినర్,మాధవి కార్యదర్శి, ఆనంద్ ఇందూరు ప్రజలు పాల్గొన్నారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు రామకృష్ణ పాఠశాల విద్యార్థులు చేసిన నృత్యం అక్కట్టుకుంది. గాయకులు గణపతి, శివుని, అయ్యప్ప, వెంకటేశ్వరునీ భక్తి పాటలు ఆకట్టుకున్నాయి.

ఆర్కెస్ట్రా బృందం .

గోరకంటి రాజు, సారారం కృష్ణ, కైలాష్, యోగేష్ జోషి ( సంస్కార భారతి సంగీత్ విభాగ్ ప్రముఖ్ ),జలంధర్, ప్రశాంత్ రెడ్డి, కర్క రమేష్, రోహిత్, సంతోష్, రాహుల్, రమాదేవి,

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5