జన జీవన స్రవంతిలో చేరిన మావోయిస్టు సుశీల రాణి
నిజామాబాద్ సిపి సాయి చైతన్య సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టు కమిటీ సభ్యురాలు నక్క సుశీల.. 5 లక్షల చెక్కు 25 వేల తక్షణ అర్థిక సహాయం అందజేత

మన ఇందూర్ నిజామాబాద్ అర్బన్
మావోయిస్టు కమిటీ సభ్యురాలు నక్క సుశీల అలియాస్ రాణి అలియాస్ లత లలిత రేలా జ్యోతి అలియాస్ మాధవి అలియాస్ శ్వేత నిజామాబాద్ పోలీసుల సమక్షంలో లొంగిపోయారు.
ఈ మేరకు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మంగళవారం విలేకరుల సమక్షంలో వివరాలు వెల్లడించారు...మావోయిస్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కమిటీ సభ్యురాలు, డీవీసీ ఛత్తీస్ షడ్ ఏరియా సభ్యురాలైన నక్క సుశీల బోధన్ లోని శక్కర్
నగర్ స్వస్థలం కాగా.. ఆమె తండ్రి నిజాం షుగర్ ఫ్యాక్టరీలో ఎలక్ట్రిషియన్ పనిచేసేవారనీ, అక్టోబర్ 2005లో ఆయన గుండెపోటుతో మరణించారన్నారు. సుశీల చిన్నప్పుడే తల్లి కమల అనారోగ్యంతో మృతి చెందింది. సుశీల 1985లో హైదరాబాద్ లో
ని నారాయణగూడలో మాడపాటి హనుమంతరావు బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసినట్లు తెలిపారూ.
1985 నుంచి 1987 వరకు, ఇంటర్మీడియట్ అలాగే 1987 నుంచి 1990 వరకు డిగ్రీ విద్యను హైదరాబాద్లోని నాంపల్లి ఉన్నత విద్య వనిత జూనియర్ కాలేజీలో డిగ్రీ కళాశాలలో పూర్తి చేశారు.హైదరాబాద్లో డిగ్రీ చదువుతున్న సమయంలో ఆమెకు బంధువైన సురేంద్ర ద్వారా దివంగత రామ్మోహన్రావు పరిచయమయ్యారు. ఆయన సీపీఐ ఎంఎల్ పీడబ్ల్యూ సిద్ధాంతాలు కలిగి ఉండడంతో సుశీల ఆకర్షితురాలైంది. ఆమె 1990లో నల్గొండ జిల్లా కమిటీ ఏసీఎం అయిన సుంకర రామ్మోహన్ రావు వివాహం చేసుకున్నారు. అనంతరం ఫిబ్రవరి 1992లో సీపీఐ ఎంఎల్ పీడబ్ల్యులో చేరారు. 2001లో నల్లమల అడవిలో జరిగిన ఎదురు కాల్పుల్లో రామ్మోహన్ రావు మరణించారు. ఆ తర్వాత 2004లో ఆమె సామల వెంకటేశ్వర్ల ను వివాహం చేసుకున్నారు. ఛత్తీస్ గడ్ అటవీప్రాంతంలో 2006లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆయన మరణించారన్నారు.. తెలంగాణకు చెందిన అజ్ఞాత మావోయిస్టు కార్యకర్తలు అందరూ జనజీవన స్రవంతిలో చేరాలని ప్రభుత్వం చేసిన సూచన మేరకు నక్క సుశీల సైతం జనజీవన స్రవంతిలో కలిసినట్లు సీపీ వెల్లడించారు. ఆమెకు
5 లక్షల చెక్కు, 25 వేల తక్షణ అర్థిక సహాయం అందించినట్లు తెలిపారు.






