గణేష్ నిర్వాహకులు రక్తదాన శిబిరం అభినందనీయం
శ్రీ సిద్ది వినాయక గణేష్ మండలి నిర్వాహకులు రక్తదాన శిబిరం

మన ఇందూర్ నిజామాబాద్ అర్బన్
గణేష్ నవరాత్రులలో మండళ్ళ నిర్వాహకులు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ అభినందనలు అందుకుంటున్నారు. వినాయకుడికి నిత్య పూజలు నిర్వహిస్తూనే రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు..నిజామాబాదు నగరంలోని చంద్రశేఖర్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన శ్రీ సిద్ది వినాయక గణేష్ మండలి వద్ద శనివారం నిర్వాహకులు రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి అనూహ్య స్పందన లభించింది..ఈ సందర్భంగా వంద మందికి పైగా రక్తదానం చేశారు..రక్తదాతలకు ప్రముఖ పల్మనాలజీ వైద్యులు, ఆర్పీ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ బొద్దుల రాజేంద్రప్రసాద్ సర్టిఫికెట్లు,జ్ఞాపికలు అందజేశారు..అనంతరం డాక్టర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ గణేష్ నవరాత్రులలో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు..రక్తదాతలు ప్రాణదాతలని ఆయన కొనియాడారు..ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలన్నారు..ఈ కార్యక్రమంలో ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వనిత,దంత వైద్యులు జమాల్పూర్ రాజశేఖర్, ఆర్పీ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి చింతల గంగాదాస్, ఆర్గనైజింగ్ కార్యదర్శి మెరుగు నాగరాజు,సిద్ది వినాయక గణేష్ మండలి నిర్వాహకులు లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.






