ఐటిఐ గ్రౌండ్ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తా అర్బన్
ఐటిఐ వాకర్స్ అసోసియేషన్ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలి. అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్య నారాయణ..

ఐటిఐ వాకర్స్ అసోసియేషన్ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలి
ఐటిఐ గ్రౌండ్ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తా
అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్య నారాయణ
మన ఇందూర్/నిజామాబాద్ అర్బన్
ఐటిఐ వాకర్స్ అసోసియేషన్ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలని అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్య నారాయణ అన్నారు. నగరంలోని న్యాల్ కల్ రోడ్డులో ఓ ఫంక్షన్ హాల్ లో ఆదివారం ఏర్పాటుచేసిన ఐటిఐ వాకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నూతనంగా ఏర్పాటైన కార్యవర్గంచే ఎమ్మెల్యే ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ఆయన మాట్లాడుతూ..ఐటిఐ గ్రౌండ్ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానన్నారు.వాకింగ్ గ్రూప్ రాజకీయం వైపు పోకుండా ఐకమత్యంగా ఉంటూ సమాజ సేవా కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలన్నారు. శారీరక దృఢత్వం ఉంటేనే జీవితంలో ఏదైనా సాధించవచ్చన్నారు. ఐటిఐ వాకర్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లాలోనే ఆదర్శ నిలిచిందన్నారు. వాకర్స్ అసోసియేషన్ సొంత డబ్బులతో సమాజసేవ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అభినందించారు. ఐటిఐ గ్రౌండ్ లో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
నుడా చైర్మన్ కేశ వేణు మాట్లాడుతూ ..ఐటిఐ గ్రౌండ్ లో ఓపెన్ జిమ్ మరింత విస్తరించేలా నిధులు కేటాయిస్తామన్నారు. గ్రౌండ్ లో కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేసేలా చూస్తానన్నారు. ఐటిఐ వాకర్స్ అసోసియేషన్ ను చూస్తే సంతోషంగా ఉందన్నారు. ఆరోగ్యానికి ఆరోగ్యం .. ఐకమత్యం ఇక్కడ కనిపిస్తుందన్నారు. ప్రతి ఒక్కరు నడకను దినచర్యగా అలవాటు చేసుకోవాలన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని వాకర్స్ గ్రూపుని చూస్తే ఇట్టే అర్థమవుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ కూరగాయల ఉమారాణి, డిసిసి డెలిగేట్ భక్తవత్సలం నాయుడు, కార్పొరేటర్లు, జగదీష్ కులగర్ని, మురళి, శ్రవణ్ రమేష్ గుప్తా, శ్రీనివాస్ రెడ్డి, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గొండల పృథ్వీరాజ్, ప్రధాన కార్యదర్శి మోహన్ గైక్వాడ్, కోశాధికారి సీతారాములు, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
.






