Mana Indur News
విద్య Education

భీమ్‌గల్‌లో అర్బన్ మండల గేమ్స్ ఘనంగా ప్రారంభం

విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి, శారీరక దృఢత్వం పెంపొందించడంలో క్రీడా పోటీలు ఎంతో దోహదం

Bu
By Bushan •November 20, 2026
21
Share
భీమ్‌గల్‌లో అర్బన్ మండల గేమ్స్ ఘనంగా ప్రారంభం

భీమ్‌గల్‌లో అర్బన్ మండల గేమ్స్ ఘనంగా ప్రారంభం

మన ఇందూర్ న్యూస్/నిజామాబాద్:

భీమ్‌గల్ అర్బన్ మండల స్థాయి క్రీడా పోటీలు శుక్రవారం కృషి హై స్కూల్, భీమ్‌గల్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి భీమ్‌గల్ మున్సిపల్ చైర్మన్ నాగమణి స్వామి ముఖ్య అతిథిగా హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి, శారీరక దృఢత్వం పెంపొందించడంలో ఇటువంటి పోటీలు ఎంతో దోహదపడతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అనంత్ రావు, సందీప్, ఎం.ఈ.ఓ స్వామి, పి.ఆర్.టి.యు భీమ్‌గల్ మండల ప్రెసిడెంట్ కాశిరాం, జనరల్ సెక్రటరీ రవీందర్ పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు రవీందర్ రెడ్డి, వసంత్ రెడ్డి, షఫీ, శేఖర్, రాజ్‌కుమార్, నర్సయ్య, జగదీష్, ప్రసాద్ రావు, పి.ఇ.టి.ఎ మాజీ అధ్యక్షుడు విద్యాసాగర్ రెడ్డి, జెడ్.పి.హెచ్.ఎస్ భీమ్‌గల్ పి.డి రమణ, వివిధ పాఠశాలల పి.ఇ.టిలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మండలంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ఈ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గెలుపొందిన విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికవుతారని నిర్వాహకులు తెలిపారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5