Mana Indur News
విద్య Education

ఇక నుండి విద్యార్థుల వద్ద నుండి ఫీజులు వసూలు చేయకుండా పరీక్షలు నిర్వహించాలి

విద్యార్థుల వద్ద నుంచి ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలు సంవత్సరం ఫీజులో సగం ఫీజు మాత్రమే తీసుకోవాలి.

Da
By Dayanand •November 4, 2026
11
Share
ఇక నుండి విద్యార్థుల వద్ద నుండి ఫీజులు వసూలు చేయకుండా పరీక్షలు నిర్వహించాలి

ఇక నుండి విద్యార్థుల వద్ద నుండి ఫీజులు వసూలు చేయకుండా పరీక్షలు నిర్వహించాలి

విద్యార్థుల వద్ద నుంచి ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలు సంవత్సరం ఫీజులో సగం ఫీజు మాత్రమే తీసుకోవాలి.

మన ఇందూర్ న్యూస్/ఏర్గట్ల ఆర్మూర్:

ఇక నుంచి తెలంగాణ రాష్ట్రoలో జరగబోయే ఎస్ ఎస్ సి, ఇంటర్, డిగ్రీ, పీజీ తదితర బోర్డ్ పరీక్షల ఫీజులు విద్యార్థుల వద్ద నుంచి వసూలు చేయకుండా ప్రభుత్వం పరీక్షలు ఉచితంగా నిర్వహించాలని దయానంద్ కోరారు. ఎల్ నీనో కరువు దృష్ట్యా ప్రభుత్వ,ప్రయివేట్ పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ, పీజీ, బి టెక్, ఏం టెక్ విద్యార్థుల వద్ద పరీక్ష ఫీజులు మాఫీ చేసి వారు చెల్లించే సంవత్సరం ఫీజులో కూడా కుల, వర్గ బేధాలు లేకుండా విద్యార్థుల వద్ద సగం ఫీజులు మాత్రమే కాలేజీల యాజమాన్యాలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా ఉపసర్పంచ్ ఫోరమ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మూడ్ దయానంద్ ప్రభుత్వనికి, అధికారులకు విజ్ఞప్తి చేస్తూ మరియు రాష్ట్ర ఆయా ఏడ్యూకేషన్ బోర్డుల అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి విషయాన్ని తీసుకెళ్ళాలాన్ని కోరుతూ.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వీయ దృష్టి కి నిజామాబాద్ జిల్లా ఉపసర్పంచ్ ఫోరమ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మూడ్ దయానంద్ మంగళవారం సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వీయ కు వినతిపత్రం అందజేశారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5