కలలు కనండి.. లక్ష్యాలను సాధించండి: బట్టు రాజేశ్వర్
బాల్కొండలో పదో తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్

కలలు కనండి.. లక్ష్యాలను సాధించండి: బట్టు రాజేశ్వర్
బాల్కొండలో పదో తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్
మన ఇందూర్ న్యూస్/బాల్కొండ:
విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి సాధనకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని పీఎం శ్రీ జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బట్టు రాజేశ్వర్ అన్నారు. శుక్రవారం బాల్కొండ పీఎం శ్రీ జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు నిహా అకాడమీ ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ్ అడెపు విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడిసిన్, లా, ఐటీ, డిఫెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర రంగాల్లో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించారు.
విద్యార్థులు తమ ఆసక్తులు, అభిరుచులు, సామర్థ్యాలను గుర్తించి సరైన కెరీర్‌ను ఎంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిహా అకాడమీ హెడ్ పల్లవి సంగెం పాల్గొన్నారు. కార్యక్రమానికి సహకరించిన ప్రధానోపాధ్యాయులు బట్టు రాజేశ్వర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని పాఠశాలల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు.






