ప్రభుత్వ సౌకర్యాలను అందిపుచ్చుకోవాలి
సిర్పూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లాటికర్ రాము
KA
By KARKA RAMESH•September 19, 2026
1

మన ఇందూర్ మోపాల్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను అందిపుచ్చుకుని భావి భారత పౌరులుగా ఎదగాలని సిర్పూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లాటికర్ రాము సూచించారు. శనివారం మండలంలోని సిర్‌పూర్ ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థులతో వారి అభ్యసన సామర్థ్యాలను తల్లిదండ్రుల ఎదుట ప్రదర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల సామర్థ్యాలను గమనించి సంతృప్తి వ్యక్తంచేశారు. అనంతరం లాటికర్ రాము మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు అన్నిరంగాల్లో ముందంజలో ఉన్నారన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వసంత, అనురాధ, గంగాప్రసాద్, సుష్మ, సుకన్య, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.






