టిఎన్జీవో జిల్లా కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి

మన ఇందూర్ నిజామాబాద్ అర్బన్
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం టిఎన్జీవో జిల్లా కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వేడుకలను ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీరితోపాటు టిఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్,రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సతీష్,జిల్లా కోశాధికారి నిరంజన్ గౌడ్, ఉపాధ్యక్షులు సంజీవయ్య, జాఫర్ హుస్సేన్, అర్బన్ యూనిట్ కార్యదర్శి మారుతి, జిల్లా కార్యవర్గ సభ్యులు స్వామి, రాజేశ్వర్, టీఎన్జీవో ముఖ్య సలహాదారులు వనమాల సుధాకర్, క్లాస్ ఫోర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నేరెళ్ల శ్రీనివాస్ తదితరులు హాజరైనారు.






