నిరసన కార్యక్రమంలో పాల్గొన్న హొన్నాజీ పెట్, మద్దుల్ తాండ నాయకులు
పాల్గొన్న రూరల్ నియోజక వర్గం నాయకులు
MI
By Mana Indur News•September 28, 2026
12

మన ఇందూర్/నిజామాబాద్:
ఎఐసిసి పిలుపు టీపీసీసీ ఆదేశాల మేరకు సోమవారం నిజామాబాద్ కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద జిల్లా కాంగ్రెస్ కమిటీ, నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఓట్ల చోరీ వ్యవహారం లో (CEC) సిఇసి జ్ఞానేష్ కుమార్ తీసుకున్న వ్యవస్థ వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ ఆయన వెంటనే రాజీనామా చేయాలనీ కోరుతూ నిరసన కార్యక్రమం జ్ఞానేష్ కుమార్ దిష్టి బొమ్మ దగ్ధం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హొన్నాజీ పెట్ గ్రామ శాఖ అద్యక్షులు మైలారం సుదర్శన్ ఆధ్వర్యంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బేతీ శ్రీనివాస్, సుభాష్ రెడ్డి, లింబ్యా నాయక్, మంగీత్యా నాయక్, దత్తు నాయక్ సంపత్, రాఘవేందర్, గంగారం, పాల్గొన్నారు.






