శీతలమాత కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గణపతి హోమం
24 వ డివిజన్లో చింత చెట్టు మైసమ్మ.

మన ఇందూర్ / నిజామాబాద్ అర్బన్:
24 వ డివిజన్ లో చింత చెట్టు మైసమ్మ వద్ద శీతలమాత కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గణపతి హోమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో నగర DCC అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ దంపతులు పాల్గొన్నారు, ఈ సందర్బంగా రామకృష్ణ మాట్లాడుతూ.. గణపతి హోమం అనేది విఘ్నాలు తొలగిపోవడానికి, కార్యసిద్ధికి, ఆరోగ్యానికి సకల ఐశ్వర్యాల ప్రాప్తికి చేసే అత్యంత పవిత్రమైన వైదిక పూజా కార్యక్రమని, ఏ శుభకార్యం ప్రారంభించినా విఘ్నేశ్వరునికి పూజ చేయడం మన సాంప్రదాయం, అలాగే ఏవైనా పెద్ద సమస్యలు, అడ్డంకులు ఉన్నప్పుడు గణపతి యజ్ఞం నిర్వహించడం విశేష ఫలితాన్నిస్తుందని తెలిపారు.మన ధర్మంలో ఏ పని ప్రారంభించినా, ఏ పూజ చేసినా మొదట ఆ విఘ్నేశ్వరుడిని ఆరాధించడం మన ఆచారం. అటువంటి లంబోదరుని ఉత్సవాలను, యజ్ఞాలను ప్రతి ఏటా మనమందరం కలిసికట్టుగా, ఒక పండుగలా జరుపుకోవాలని తెలిపారు.వినాయకుడు కేవలం పూజలందుకునే దేవుడే కాదు, ఆయన ప్రతి రూపం వెనుక ఒక గొప్ప జీవిత సత్యం ఉంది.పవిత్రమైన వినాయక యజ్ఞాలు మరియు పూజల వల్ల మన సమాజానికి, మన కుటుంబాలకు సకల శుభాలు కలుగుతాయని మనలో ఐక్యత, సద్భావన పెరుగుతాయని, ఈ ఉత్సవాల్లో మనమంతా పాల్గొని ఆ స్వామి కృపకు పాత్రులవుదాం.ఈ వేడుకను ఇంత వైభవంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు, సహకరించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.ఆ బొజ్జ గణపయ్య ఆశీస్సులతో మనందరి విఘ్నాలు తొలగిపోయి, ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని ఆకాంక్షిస్తున్నాని తెలిపారు.






