అంతర్జతీయ వయో వృద్ధుల దినోత్సవ వారోత్సవాలలో కరపత్రాల ఆవిష్కరణ.
కరపత్రాలను ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ భుజంగ రావు.

మన ఇందూర్/నిజామాబాద్ అర్బన్:
అంతర్జతీయ వయో వృద్ధుల దినోత్సవ వారోత్సవాలలో కరపత్రాలను అదనపు కలెక్టర్ (LB) భుజంగ రావు ఆవిష్కరించారు. అంతర్జతీయ వయో వృద్ధుల దినోత్సవ వారోత్సవాలలో భాగముగా గురువారము న “వృద్ధుల సంక్షేమం, సాధికారత వారోత్సవం – 2026 ప్రారంభ” కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ నిజామాబాద్ చాంబరు లో నిర్వహించడమైనది. ఈ కార్యక్రమములో వయో వృద్దుల సంక్షేమానికై ప్రభుత్వము ద్వారా చేపట్టబడే వివిధ రకాల పథకములను వయో వృద్దుల సంక్షేమానికి ఏర్పాటు చేయబడిన చట్టాల వివరాలను, కరపత్రాలను ఆవిష్కరించడమైనది.ఈ కార్యక్రమములో అదనపు కలెక్టర్ (LB) భుజంగ రావు, జిల్లా సంక్షేమ అధికారిణి డి. సౌందర్య, పర్యవేక్షకులు శ్రీనివాస్, రేఖ, పోలీసు శాఖ నుంచి రాజు ఎస్ ఎల్ జిల్లా స్థాయి సీనియర్ సిటిజన్ కమిటీ సభ్యులు, ఆజనేయులు, మాయావార్ రాజేశ్వర్, నారాయణ రెడ్డి , ఫయాజుద్దీన్, వాసవి క్లబ్ రవి జిల్లాలో గల సీనియర్ సిటిజన్ ఫోరమ్స్, అసోసియేషన్స్ ట్రస్టుల ఫౌండేషన్స్, అధ్యక్షులు, కార్యదర్శుల ప్రతినిధులు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు.






