జి.జి కళాశాలలో పరిశోధన కేంద్రం మంజూరుకు వినతి పత్రం
సానుకూలంగా స్పందించిన వీసీ, రిజిస్ట్రార్
KA
By KARKA RAMESH•September 22, 2026
138

మన ఇందూర్ /నిజామాబాద్ అర్బన్ :
డిచ్ పల్లి: తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ టి. యాదగిరి రావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. యాదగిరి, అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ లను నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు టీయూ ఈసీ మెంబర్ డాక్టర్ దండుస్వామి నేతృత్వంలో జి.జి కళాశాలకు పరిశోధన కేంద్రంను మంజూరు చేయవలసిందిగా వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వీసీ, రిజిస్ట్రార్ సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే ఒక కమిటీని ఏర్పాటు చేసి, పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జి.జి. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. రామ్మోహన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్ రంగరత్నం, డా. ఇందూరు గంగాధర్, వినయ కుమార్, లెఫ్టినెంట్ డాక్టర్ ఎం రామస్వామి తదితరులు పాల్గొన్నారు.






