Mana Indur News
కల్చరల్

భగత్ సింగ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి

మాజీ PDSU జిల్లా కార్యదర్శి, లెక్చరర్ డా. ప్రగతి

KA
By KARKA RAMESH•September 24, 2026
48
Share
భగత్ సింగ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి

మన ఇందూర్ / నిజామాబాద్ అర్బన్

భగత్ సింగ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి – డా. ప్రగతి అన్నారు. భారత స్వాతంత్ర్య ఉద్యమ వీర కిషోరం కామ్రేడ్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్ కాలనీ ఎస్సీ బాలికల హాస్టల్‌లో PDSU ఆధ్వర్యంలో గురువారం భగత్ సింగ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా మాజీ PDSU జిల్లా కార్యదర్శి, లెక్చరర్ డా. ప్రగతి హాజరై విద్యార్థినులనుద్దేశించి మాట్లాడారు. భగత్ సింగ్ జీవితం, ఆయన పోరాట స్ఫూర్తి, సమాజం పట్ల ఆయనకున్న బాధ్యతను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.భగత్ సింగ్ చిన్న వయసులోనే దేశంలోని సామాజిక పరిస్థితులను లోతుగా అధ్యయనం చేసి, అన్యాయం, దోపిడీ, అసమానతలకు వ్యతిరేకంగా ప్రశ్నించే ధైర్యాన్ని పెంపొందించుకున్నారని తెలిపారు. విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా సమాజాన్ని అధ్యయనం చేయాలని, తమ చుట్టూ జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకోవాలని, అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించే చైతన్యాన్ని పెంచుకోవాలని సూచించారు.విద్య అనేది కేవలం ఉద్యోగం కోసం మాత్రమే కాకుండా సమాజాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని, మంచి చెడులను విశ్లేషించే ఆలోచనా శక్తిని పెంపొందించేదిగా ఉండాలని అన్నారు. భగత్ సింగ్ జీవితంలో అధ్యయనం, ఆలోచన, ప్రశ్నించడం, ప్రజల కోసం నిలబడటం ఎంతో ముఖ్యమైనవని పేర్కొన్నారు.ప్రస్తుత విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకుని, మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని, సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థి దశ నుంచే సామాజిక బాధ్యతను అలవర్చుకుంటేనే సమాజంలో మంచి మార్పు సాధ్యమవుతుందని తెలిపారు.భగత్ సింగ్‌ను కేవలం జయంతి రోజున స్మరించుకోవడం కాకుండా, ఆయన ఆశయాలను అధ్యయనం చేసి, ఆయనలోని ప్రశ్నించే తత్వాన్ని మరియు సామాజిక చైతన్యాన్ని విద్యార్థులు తమ జీవితంలో ఆచరించాలని డా. ప్రగతి పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో PDSU జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కర్క గణేష్, ఎల్. అనిల్ కుమార్, నగర అధ్యక్ష కార్యదర్శులు ఎండి. నసీర్ , ఆల్గోట్ సృజన్, హాస్టల్ వార్డెన్ సుజన, నాయకులు, విద్యార్థినులు తదితరులు పాల్గొని భగత్ సింగ్‌కు ఘనంగా నివాళులర్పించారు.

#భగత్ సింగ్ జయంతి.

#pdsu

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5