మోక్షగుండం విశ్వేశ్వరయ్య డిప్లమా ఇంజనీరు నుంచి భారతరత్న అవార్డు స్థాయికి
పాలిటెక్నిక్ కళాశాలలో ఘనంగా ఇంజనీర్స్ డే వేడుకలు.

మోక్షగుండం విశ్వేశ్వరయ్య డిప్లమా ఇంజనీరు నుంచి భారతరత్న అవార్డు తీసుకునే స్థాయికి
మన ఇందూర్ నిజామాబాద్ అర్బన్:
మోక్షగుండం విశ్వేశ్వరయ్య డిప్లమా ఇంజనీరు నుంచి భారతరత్న అవార్డు తీసుకునే స్థాయికి ఎదిగారని, ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని పివి రాజేశ్వరరావు అన్నారు.
ఘనంగా ఇంజనీర్స్ వేడుకలు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదిన పురస్కరించుకొని పూర్వ విద్యార్థుల సంఘం ప్రభుత్వ పాలిటెక్నిక్ అధ్వర్యంలో మంగళవారం
ఇంజనీర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి కార్యక్రమానికి ముఖ్య అతిథులు పివి రాజేశ్వరరావు ఎస్ ఈ ఆపరేషన్, నిజామాబాద్ గౌరవ అతిథులు రాథోడ్ శంకర్ ఎస్ ఈ పి ఆర్, నిజామాబాద్ అదిలాబాద్ పూర్వ విద్యార్థుల ప్రతినిధులు సన్మానం రైతులు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నార్త్ బ్లాక్ సమావేశ మందిరంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఫోటోకు పూలమాలవేసి జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని గౌరవ అతిధులు ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పివి రాజేశ్వరరావు ఎస్ ఈ మాట్లాడుతూ.. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒక డిప్లమా ఇంజనీరు నుంచి భారతరత్న అవార్డు తీసుకునే స్థాయికి ఎదిగారు మనందరికీ కూడా వారిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు కష్టపడి బాగా చదివి కళాశాలకు వారి కుటుంబానికి మన మన జిల్లాకు మంచి పేరు తేవాలని సూచించారు నిజాంబాద్ పాలిటెక్నిక్ రాష్ట్రంలోనే ఉన్నత స్థానం ఉందని అది అలాగే నిలపడానికి మనం ప్రయత్నం చేయాలని అన్నారు కార్యక్రమం గౌరవ అతిధి రాథోడ్ శంకర్ ఎస్ ఈ పంచాయతీరాజ్ మాట్లాడుతూ.. మేము ఈరోజు ఈ కళాశాలలో చదువుకొని ఉన్నత స్థితిలో ఉన్నాము మీరు కూడా బాగా చదువుకొని ఉన్నత స్థితికి వచ్చి కళాశాలలోని విద్యార్థులకు సేవ చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ముందుగా 8 మంది విశ్రాంత ఇంజనీర్లకు ఘనంగా సన్మానించడం జరిగింది. తర్వాత పాలిటెక్నిక్ బ్రాంచ్ టాపర్లకి మెడల్ సర్టిఫికెట్ , మెమొంటో బిగాల కృష్ణమూర్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పది వేల చెక్కు సర్టిఫికెట్ ఆరుగురికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పివి రాజేశ్వరరావు, గౌరవ అతిథిగా రాథోడ్ శంకర్ కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ రాజన్న, పూర్వ విద్యార్థుల సంఘం సహా అధ్యక్షుడు కేఎల్వి రమణ, ప్రధాన కార్యదర్శి తోట రాజశేఖర్ ,ఆర్గనైజింగ్ సెక్రటరీ మోహన్ కుమార్ సంయుక్త కార్యదర్శి పొలాస సత్యనారాయణ, వినోద్ కుమార్ ,బాబా శ్రీనివాస్, కృష్ణమూర్తి, నరేష్ కుమార్, హరికృష్ణ, వీరేశం, గంగాధర్, రషీద్ భాయ్, సయ్యద్ , రచ్చ నరసయ్య, భూమయ్య, విశ్రాంత ప్రిన్సిపల్ నాగయ్య, ప్రకాష్ రావు, నాయుడు సుబ్బారావు పాలిటెక్నిక్ నితిన్ పవర్ నాగరాజ్ పాలిటెక్నిక్ డిపార్ట్మెంట్ హెడ్స్ మరియు లెక్చరర్స్ పాలిటెక్నిక్ విద్యార్థిని విద్యార్థులు అల్యూమిని పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.






