Mana Indur News
కల్చరల్

ఓమౌజయా ఎకోపాసన మహాధర్మం ఆధ్వర్యంలో పరబ్రహ్మ యజ్ఞం

ప్రభు పల్లకి సేవ సాయత్రం 4 గం. నుంచి 5 గంటల వరకు.

KA
By KARKA RAMESH•September 25, 2026
5
Share
ఓమౌజయా ఎకోపాసన మహాధర్మం ఆధ్వర్యంలో పరబ్రహ్మ యజ్ఞం

నేడు శ్రీ పరబ్రహ్మ యజ్ఞం

మన ఇందూర్ / నిజామాబాద్ అర్బన్:

ఎకోపాసన మహాధర్మం నిర్వాహకులు ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వినాయక కళ్యాణ మండపంలో ఓమౌజయా ఎకోపాసన మహాధర్మం ఆధ్వర్యంలో పరబ్రహ్మ యజ్ఞం నిర్వహిస్తున్నామని వారు శ్రీపరమోజీ బ్రహ్మ శాస్త్రజ్ఞ శ్రీఋషి ప్రజ్ఞానంద స్వామి శ్రీపరమోజీ త్రిగుణాత్మక సిద్ద శ్రీపరమోజీ యోగీ ఆచల ప్రజ్ఞ శ్రీమహా రాజేశ్వర్ తెలిపారు.. శక్తిపీఠం ర్యాలీ తో పాటు శ్రీ ప్రభు పల్లకి సేవ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం శ్రీ పరబ్రహ్మ యజ్ఞం ఉంటుందని అన్నారు. భద్రపద పౌర్ణమి య జ్ఞంలో పాల్గోనడం వలన శ్రీ పురుషార్థ చక్రం అనే యోగంపళం సంభవిస్తుందని తెలిపారు. యజ్ఞానికి వచ్చే భక్తులు తమ ఇంటి నుంచి నవధాన్యాలు తెచ్చుకొని యజ్ఞ గుండ లో సమర్పించాలని సూచించారు. యజ్ఞం అనంతరం అన్న ప్రసాద వితరణ ఉంటుందని అన్నారు.ప్రభు పల్లకి సేవ సాయత్రం 4 గం. నుంచి 5 గంటల వరకు ఉంటుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు పాల్గొన్నారు..

#పరబ్రహ్మ యజ్ఞం.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5