Mana Indur News
స్థానిక వార్తలు

జిజిఎచ్ లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కరించాలి

ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి కి AITUC వినతి

Ji
By Jithendhar reddy •September 18, 2026
1
Share
జిజిఎచ్ లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కరించాలి

మన ఇందూర్ నిజామాబాద్

జిజిఎచ్ లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై.ఓమయ్య, తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పి.సుధాకర్ కోరారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పి.సుదర్శన్ రెడ్డిని హైదరాబాద్ లోని

స్వగృహంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై.ఓమయ్య, తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పి.సుధాకర్ కలిసి సమస్యలతో కూడా వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిజిహెచ్ లో ప్రతిరోజు ఓపి 2500, ఐపి 200 పెరిగినందున ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపోవడం లేదని గుర్తు చేశారు.గతంలో 750పడకలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం చేసిన బడ్జెట్ కేటాయించక లేకపోవడంతో సిబ్బందిని పెంచలేదన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి పని భారం పెరిగి అనారోగ్యాల పాలవుతున్నారని, వెంటనే బడ్జెట్ కేటాయించి, కార్మికుల వేతనాలు పెంచడంతోపాటు, కార్మికుల సంఖ్యను పెంచుతూ ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరామన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5