Mana Indur News
కల్చరల్

రిటైర్డ్ ప్రొఫెసర్‌కు ఘన సన్మానం

ది ఆదర్శ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆరు నెలల పూర్తి

KA
By KARKA RAMESH•September 21, 2026
31
Share
రిటైర్డ్ ప్రొఫెసర్‌కు ఘన సన్మానం

మన ఇందూర్ అర్బన్:

నిజామాబాద్‌లోని గుబ్బవాడి రోడ్, దుబ్బ ప్రాంతంలో ఉన్న ది ఆదర్శ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆరు నెలల పూర్తి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జీజీ కళాశాల, నిజామాబాద్‌లో కామర్స్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ సెర్ల దయానంద్ ను బ్యాంక్ మేనేజర్ చిలుక శ్రావణి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యెర్రం రంజిత్, పుప్పాల గౌతమి, వై. కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ప్రొఫెసర్ సెర్ల దయానంద్‌ను శాలువాతో సత్కరించి, అభినందనలు తెలిపారు. ఆరు నెలల పూర్తి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5