ప్రెస్ క్లబ్ లడ్డు ను దక్కించుకున్న రజినీకాంత్
వేలంలో రూ.13211 లకు దక్కించుకున్న V6 స్టాఫర్ రజనీకాంత్

*గణేశుని దయ ఉండాలని*
మన ఇందూర్ / నిజామాబాద్ అర్బన్:
ప్రెస్ క్లబ్ లో నవరాత్రులు పూజలు అందుకున్న గణేశుడి లడ్డు ను V6 స్టాఫర్ రజనీకాంత్ వేలంలో రూ.13211 లకు దక్కించుకున్నారని ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పంచరెడ్డి రెడ్డి శ్రీకాంత్, వాగ్మేరే సుభాష్ లు తెలిపారు. ప్రెస్ క్లబ్ అడ్డును దక్కించుకున్న వారికి ఆయురారోగ్యాలతో పాటు అష్ట ఐశ్వర్యాలు, అనుకున్న పనులు సహకారం అవుతాయన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ సాయి ప్రసాద్ రూ.13111 పాడగా.. రజినీకాంత్ రూ.13211 తో సొంతం చేసుకున్నారన్నారు.
గతంలో ప్రెస్ క్లబ్ గణేశుని లడ్డును దక్కించుకున్న వారికి అంతా మంచి జరిగిందని, ఈ సంవత్సరం వేలంలో లడ్డు ను దక్కించుకున్న రజనీకాంత్ కు అంత మంచి జరగాలని కోరుకుంటున్నారన్నారు. ఈ సందర్భంగా ఆయనను ప్రెస్ క్లబ్ పక్షాన శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. ప్రెస్ క్లబ్ అంటేనే కుల మతాలు అతీతంగా అన్ని పండుగలు జరుపుతామని, గణపతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించామన్నారు. ఈ లడ్డు వేలం కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.






