Mana Indur News
స్థానిక వార్తలు

ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఐకెపి ఆధ్వర్యంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీడీవో సంతోష్ కుమార్..

S
By S KISHOR •October 1, 2026
7
Share
ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

మన ఇందూర్ న్యూస్ /భీమ్‌గల్ రూరల్ :

భీమ్‌గల్ మండలం బాబాపూర్ గ్రామంలో గురువారం ఐకెపి ఆధ్వర్యంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీడీవో సంతోష్ కుమార్ ప్రారంభించారు.ఎంపీడీవో సంతోష్ కుమార్ మాట్లాడుతూ,ర్రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అక్టోబర్ 1వ తేదీ నుంచే ఐకెపి,సొసైటీ ల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.రైతులు వరి ధాన్యాన్ని చక్కగా ఆరబెట్టి తప్పా,తాలు లేకుండా ఐకెపి,సొసైటీ కేంద్రాలకు తీసుకురావాలని ఎంపీడీవో కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి లావణ్య,సర్పంచ్ సమీర్,ఉప సర్పంచ్ గోవర్ధన్,ఏఎంసీ డైరెక్టర్ చిన్నారెడ్డి,ఐకేపీ సీసీలు శ్రీనివాస్,గంగాధర్,వీఓ మహిళలు,రైతులు,గ్రామస్తులు పాల్గొన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5