Mana Indur News
స్థానిక వార్తలు

విశ్వకర్మ సకల సృష్టికి మూలకర్తగా, దేవతల శిల్పిగా దివ్య వడ్రంగిగా పూజించబడతారు

వాడి లో ఘనంగా విశ్వ కర్మ జయంతి

TE
By TEDDU SAI KUMAR •September 17, 2026
22
Share
విశ్వకర్మ సకల సృష్టికి మూలకర్తగా, దేవతల శిల్పిగా దివ్య వడ్రంగిగా పూజించబడతారు

మన ఇందూర్ ధర్పల్లి :

విశ్వకర్మ సకల సృష్టికి మూలకర్తగా, దేవతల శిల్పిగా దివ్య వడ్రంగిగా పూజించబడతారని చెలిమెల రమేష్, రాందాస్ అన్నారు.
గురువారం ధర్పల్లి మండలం వాడి గ్రామం లో విశ్వకర్మ యూత్ ఆధ్వర్యంలో విశ్వ కర్మ జయంతి ఘనంగా నిర్వహించారు. ముందుగా విశ్వ కర్మ చిత్ర పటానికి పూలమాల  వేసి, పనిముట్లు, యంత్రాలను శుభ్రం చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..విశ్వకర్మ భగవానుడిని హస్తకళాకారులు, ఇంజనీర్లు, కార్మికులు, శిల్పులు ఎంతో భక్తితో పూజిస్తారన్నారు.సమాజ నిర్మాణంలో ఎంతో కీలకమైన శిల్పులు, వృత్తి నిపుణులు, కార్మికులకు విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  చెలిమెల రాందాస్, రంజిత్, రాకేష్,నర్సయ్య, రమేష్.గ్రామ యువత దశరథ్, సతీష్, సాయికుమార్ పాల్గొన్నారు.



అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5