మోదీ జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం
బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి

మన ఇందూర్ ఇందల్వాయి:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఇందల్వాయి మండల కేంద్రంలో గురువారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు బీజేపీ ఇందల్వాయి మండల ఇన్‌చార్జి అధ్యక్షుడు శ్రీనివాస్ జల్లెల, బీజేవైఎం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామపంచాయతీ పరిధిలో ఏర్పాటు చేయనున్న ఈ రక్తదాన శిబిరంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని వారు పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం నుంచి పార్టీ కార్యకర్తలు తరలివచ్చి శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు. మోదీ జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రక్తదానం చేయడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి సహాయం అందించవచ్చని పేర్కొన్నారు.






