Mana Indur News
స్థానిక వార్తలు

బాల సాహిత్యం గొప్ప సాహిత్యం

బాల సాహిత్యంతో సృజనాత్మకత జిజ్ఞాస పెరుగుతుంది

KA
By KARKA RAMESH•September 13, 2026
7
Share
బాల సాహిత్యం గొప్ప సాహిత్యం

బాల సాహిత్యం చాలా గొప్ప సాహిత్యమని రచయిత్రి, కవయిత్రి సమత తెలిపారు. చిన్నారుల్లో సృజనాత్మకత, మంచి ఆలోచనలు, మానవీయ విలువలు పెంపొందించడంలో బాల సాహిత్యం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. రంగినేని సుజాతా మోహన్రావు ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్, సిరిసిల్ల వారి ఆధ్వర్యంలో "మన బాల సాహిత్యం ఎంతవరకు చేరుతుంది, ఎందుకు?" అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో కవయిత్రి సమత పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో బాల సాహిత్యానికి ఉన్న ప్రాధాన్యతను, అది చిన్నారుల కు మరింత చేరువ కావాల్సిన అవసరాన్ని వివరించారు . పిల్లల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయు లు, సాహిత్య సంస్థలు కృషి చేయాలని ఆమె సూచించారు. అనంతరం కవయిత్రి సమతను శాలువా, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు కవులు, కవయిత్రులు, రచయితలు, సాహిత్య అభిమానులు తదితరులు పాల్గొన్నారు

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5