టీఎల్‌ఎస్‌ఏ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా తోట నవీన్ కుమార్ నియామకం
తెలంగాణ లీగల్ స్టూడెంట్ అసోసియేషన్ (TLSA) సంస్థ అభివృద్ధి, విద్యార్థుల సమస్యల పరిష్కారం

టీఎల్‌ఎస్‌ఏ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా తోట నవీన్ కుమార్ నియామకం
మన ఇందూర్ న్యూస్/బాల్కొండ :
తెలంగాణ లీగల్ స్టూడెంట్ అసోసియేషన్ (TLSA) సంస్థ అభివృద్ధి, విద్యార్థుల సమస్యల పరిష్కారం సంస్థ లక్ష్యాల సాధన కోసం నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాల్కొండకు చెందిన తోట నవీన్ కుమార్ నియామకం అయ్యారు. ఈ మేరకు TLSA వ్యవస్థాపక అధ్యక్షులు కె. బాలు నాయక్ మరియు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ జిల్ల నర్సాగౌడ్ సంయుక్తంగా నియామక పత్రాన్ని జారీ చేశారు. సంస్థ లక్ష్యాల సాధనలో పూర్తి సహకారం అందించాలని మరియు సమాజంలో విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తోట నవీన్ కుమార్‌ను పలువురు విద్యార్థి సంఘ నాయకులు, మిత్రులు మరియు శ్రేయోభిలాషులు హృదయపూర్వకంగా అభినందించారు.






