Mana Indur News
స్థానిక వార్తలు

మానవత్వం చాటిన రెంజల్ సర్పంచుల ఫోరం..

అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తోటి సర్పంచ్‌కు రూ.1.50 లక్షల ఆర్థిక సహాయం

KA
By KARKA RAMESH•November 14, 2026
33
Share
మానవత్వం చాటిన రెంజల్ సర్పంచుల ఫోరం..

మానవత్వం చాటిన రెంజల్ సర్పంచుల ఫోరం..

అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తోటి సర్పంచ్‌కు రూ.1.50 లక్షల ఆర్థిక సహాయం

రెంజల్ మండల సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం

మన ఇందూర్ న్యూస్/ రెంజల్:

అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తోటి సర్పంచ్‌కు రూ.1.50 లక్షల ఆర్థిక సహాయం చేసి రెంజల్ సర్పంచుల ఫోరం మానవత్వం చాటుకున్నారు. హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న తమ తోటి సర్పంచ్, కిసాన్ తాండ గ్రామ సర్పంచ్ విజయ్ కు రెంజల్ మండల సర్పంచుల ఫోరం సభ్యులు పరామర్శించారు. వైద్య ఖర్చులు అధికంగా అవుతున్న నేపథ్యంలో రెంజల్ మండల సర్పంచుల ఫోరం తరఫున విజయ్ కుటుంబానికి రూ.1,50,000 (లక్షా యాభై వేల రూపాయలు) ఆర్థిక సహాయంగా అందజేసి వారి ఉదారతను చాటుకున్నారు. వారి కుటుంబానికి భవిష్యత్తులో కూడా ఎలాంటి సహాయం అవసరమైనా తమ వంతు సహకారం అందిస్తామని సర్పంచులు హామీ ఇచ్చారు. అదేవిధంగా జిల్లా సర్పంచుల ఫోరం సభ్యులతో రేపు మాట్లాడి, వారి తరఫున కూడా మరింత ఆర్థిక సహాయం అందించేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా విజయ్ త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని అందరం కలిసి భగవంతుడిని ప్రార్థించారు. కష్టకాలంలో తోటి సర్పంచ్ కుటుంబానికి అండగా నిలవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. సాటాపూర్ గ్రామ సర్పంచ్ లచ్చవార్ సుహాసిని నితిన్, నీలా గ్రామ సర్పంచ్ క్యాతం యోగేష్ , బోర్గం గ్రామ సర్పంచ్ జ్యోతి కార్తీక్ , దూపల్లి గ్రామ సర్పంచ్ ధనూర్ నర్సవ్వ,, కల్లాపూర్ గ్రామ సర్పంచ్ భాను చందర్, విర్నగుట్ట తండా సర్పంచ్ జాదవ్ సుమాజాదవ్ రాజ్, అంబేద్కర్ గ్రామ సర్పంచ్ మాధవ్, కూనేపల్లి గ్రామ సర్పంచ్ మల్లేష్, సర్పంచ్ విజయ్ గారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నామన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5