Mana Indur News
స్థానిక వార్తలు

యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకుంటే లింక్ లు అంటగడుతున్న ఫర్టిలైజర్ దుకాణదారులు

చర్యలు తీసుకోవాలని సిరికొండ మండల వ్యవసాయ అధికారికి వాట్సప్ ద్వారా వినతి

KA
By KARKA RAMESH•September 20, 2026
47
Share
యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకుంటే లింక్ లు అంటగడుతున్న ఫర్టిలైజర్ దుకాణదారులు


లింకు లేకుంటే యూరియా బంద్ ?

అంటూ తేల్చి చెప్పిన ఫర్టిలైజర్ దుకానుదారులు

మన ఇందూర్ నిజామాబాద్ అర్బన్:

యూరియా యాప్ ద్వారా ఎరువులు బుక్ చేసుకుంటే
యూరియాతో పాటు నానో డీఏపీ కూడా తీసుకోవాలని లింక్ ఎరువులు లేకుండా యూరియా ఇవ్వమని ఫర్టిలైజర్ దుకానుదారులు ఇబ్బంది పెడుతున్నారని మలవత్ విట్టల్
సిరికొండ మండల వ్యవసాయ అధికారికి వాట్సప్ ద్వారా పిర్యాదు చేశారు. చీమన్ పల్లికి చెందిన తాను సెప్టెంబర్ 18 న ఆన్లైన్ ద్వారా  లక్ష్మీనరసింహ ఫర్టిలైజర్ సిరికొండ లో యూరియా బుకింగ్ చేసుకోవడం జరిగిందని, యూరియా తీసుకోవడానికి ఫర్టిలైజర్ షాప్ కి వెళ్తే వారు యూరియాతో పాటు నానో డీఏపీ కూడా లింక్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారని వాపోయారు.  తాను యాప్ ద్వారా యూరియా మాత్రమే బుక్ చేసుకున్నానని, ఫర్టిలైజర్ దుకాణదారులు మాత్రం తమకు అవసరంలేని ఎరువులు అంటగట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు యూరియా ఇచ్చేందుకు వారు సిద్ధంగా లేరని, మీరు ఎవరికి ఫిర్యాదు ఇచ్చుకుంటారరో ఇచ్చుకొండని బెదిరిస్తున్నారని తెలిపారు. రైతులను ఇబ్బందులు పెడుతున్న లక్ష్మీనరసింహ ఫర్టిలైజర్ వారిపై చట్టరిత్య చర్య తీసుకుని రైతులకు న్యాయం  కోరుతున్నామని చీమనుపల్లి కి చెందిన
మలవత్ విట్టల్ కోరారు. మండల వ్యవసాయలు క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతుల ఇబ్బందులను గుర్తించి,
ఫర్టిలైజర్ సెంటర్ పై చర్యలు తీసుకుంటారా లేదా అన్నది మాత్రం వేచి వేచి చూడాల్సిందే.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5