Mana Indur News
తెలంగాణ

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కుమార్తె నిశ్చితార్థనికి హాజరైన తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి

వధూవరులను ఆశీర్వదించిన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

KA
By KARKA RAMESH•September 24, 2026
21
Share
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కుమార్తె నిశ్చితార్థనికి హాజరైన తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి

మన ఇందూర్/హైదరాబాద్:

హైదరాబద్ లోని కొత్వాల్ గూడలో ఒక ఫామ్‌హౌస్‌లో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కుమార్తె అంజిలి-రఘు నిశ్చితార్థ వేడుక గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. కాబోయే వధూవరులను శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆశీర్వదించారు.

నవంబర్ 25న వివాహం.

వరుడు కర్నూల్ జిల్లాకు చెందిన, ప్రస్తుతం అమెరికాలో డాక్టర్‌గా స్థిరపడిన సోమల రఘురామ్ రెడ్డి. అంజలి రఘు లా వీరి వివాహం రాబోయే నవంబర్ 25న జరగనుండగా, డిసెంబర్ 5న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5